Pakistan: మా టీం సెమిస్ చేరితేనే గొప్ప..పాక్ మాజీ క్రికెటర్ 1 y ago
స్వదేశం ఆతిథ్యం ఇస్తోన్న ఛాంపియన్స్ ట్రోఫీని తమ జట్టు గెలవడం కష్టమేనని.. అసలు ఆ అర్హత లేదని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఇప్పటి వరకు పీసీబీ మరో ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి హోస్ట్ గా మారింది. కరాచీ వేదికగా పాకిస్థాన్ - న్యూజిలాండ్ మ్యాచ్లో టోర్నీ ప్రారంభం కానుంది. అయితే, డిఫెండింగ్ ఛాంపియన్ పాక్ను హాట్ ఫేవరెట్గా భావిస్తుంటే.. ఆ జట్టు మాజీ క్రికెటర్ మాత్రం నమ్మకం లేదనడం గమనార్హం.